Religion Propaganda: వాట్సాప్ గ్రూపులో వాలంటీర్ మతప్రచారం

Religion Propaganda: వాలంటీరు ఈ గ్రూపులో మత ప్రచార పోస్టులు పెడుతుండటం చర్చనీయాంశమైంది.

Kranthi
Published on: 7 July 2021 1:16 PM IST
Religion Propaganda in Whatsapp Group by Ward Volunteer in Kadapa District | AP News Today
X

Religion Propaganda on Whatsapp Group by Ward Volunteer

Ward Volunteer - Religion Propaganda: పథకాల గురించి చెప్పమ్మా అంటే ...ఇంకో విషయం కూడా మొదలెట్టిందా వాలంటీర్. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వమ్మా అంటే... తనకు నచ్చిన విషయం చెప్పుకొస్తుంది. గ్రూప్ లో చేరిన 50 మంది కుటుంబాల ప్రతినిధులకు ఆ కథలు ఈ కథలు కాకుండా ఏకంగా మతకథలు చెప్పేస్తోంది. అన్యమత ప్రచారం అక్కడా ఇక్కడా జరుగుతుందనే ఆరోపణలు వస్తూ ఉంటాయి. కాని ఏకంగా వలంటీర్ తాను ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపులోనే మొదలెట్టేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడప మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 21వ వార్డుకు చెందిన ఓ వాలంటీరు ఈ గ్రూపులో మత ప్రచార పోస్టులు పెడుతుండటం చర్చనీయాంశమైంది. దీంతో గ్రూపు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే తమకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తారేమోనన్న ఆందోళనతోనే మిన్నకుండిపోయామని చాలామంది చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ కూడా ఇప్పుడు మత ప్రచారానికి వేదికగా మారింది. ప్రజలకు సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసే వాలంటీరు వాట్సప్‌ గ్రూపులో మత ప్రచారానికి సంబంధించిన పోస్టులు పెట్టడం కలకలం రేపింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Kranthi

Kranthi

Next Story