Tirumala: తిరుమల శ్రీవారికి రిలయన్స్ భారీ విరాళం

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుబంధ ట్రస్టులకు భారీ విరాళం అందింది.

Arun Chilukuri
Published on: 3 Jan 2026 12:44 PM IST
Tirumala: తిరుమల శ్రీవారికి రిలయన్స్ భారీ విరాళం
X

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుబంధ ట్రస్టులకు భారీ విరాళం అందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పి.ఎం.ఎస్. ప్రసాద్ శ్రీవారి సేవలో భాగంగా కోట్లాది రూపాయల విరాళాన్ని అందజేశారు.

టీటీడీకి చెందిన పలు ట్రస్టుల కోసం ఆయన రూ. 3 కోట్లు విరాళంగా ప్రకటించారు. శనివారం ఉదయం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో (EO) అనిల్ కుమార్ సింఘాల్‌ను కలిసి విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను అందజేశారు.

శ్రీవారి ట్రస్టుల ద్వారా జరుగుతున్న సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాలకు ఇంత భారీ విరాళం అందించినందుకు పి.ఎం.ఎస్. ప్రసాద్‌ను ఈవో ప్రత్యేకంగా అభినందించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story