నేడు ఏపీలో కౌలు రైతులకు రైతు భరోసా నిధుల విడుదల

CM Jagan: ఉ.11గంటలకు నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్

Jyothi
Published on: 1 Sept 2023 9:16 AM IST
Release of Rythu Bharosa funds for tenant farmers in AP today
X

నేడు ఏపీలో కౌలు రైతులకు రైతు భరోసా నిధుల విడుదల

CM Jagan: ఏపీలో కౌలు రైతులకు రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమకానున్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌గా జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను జమ చేయనున్నారు. గురువారమే జరగాల్సిన కార్యక్రమం టెక్నికల్ ఇష్యూస్‌తో నేటికి వాయిదా పడింది. ఏపీలో లక్షా 46 వేల 324 మంది కౌలు రైతులకు 109 కోట్ల 74 లక్షల నిధులను జమచేయనుంది ప్రభుత్వం. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్‌ఆర్ భరోసా పథకాన్ని వర్తింపచేస్తోన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Jyothi

Jyothi

Next Story