YSRCP: వైసీపీ ఇంచార్జిల తొమ్మిద జాబితా విడుదల

YSRCP: కర్నూలు అసెంబ్లీ ఇంచార్జిగా ఇంతియాజ్

Shekhar G
Published on: 2 March 2024 9:09 AM IST
Release Of Nine List Of YCP In-Charges
X

YSRCP: వైసీపీ ఇంచార్జిల తొమ్మిద జాబితా విడుదల

YSRCP: ఎన్నికల్లో గెలుపుకోసం అధికార వైసీపీ తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఇందు కోసం నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్పులు చేర్పులు చేస్తూ.. వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్ధుల తొమ్మిదవ జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. మంగళగిరిలో నారా లోకేష్ ను ఢీకొట్టేందుకు రెండు సార్లు వైసీపీ ఇంచార్జిలను మార్చారు. 2019లో లోకేష్ పై వైసీపీ నుంచి గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని మారుస్తూ.. బీసీ నేతగా ఉన్న గంజి చిరంజీవని మంగళగిరి ఇంచార్జిగా నియమించారు.

అయితే లోకేష్ ను ఢీకొట్టే శక్తి గంజి చిరంజీవికి లేదని భావించిన వైసీపీ మరోసారి ఇంచార్జిని మార్చింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు లావణ్య పేరును ప్రకటించింది. ఇక కర్నూలు అసెంబ్లీ ఇంచార్జిగా మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్, నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది.

Shekhar G

Shekhar G

Next Story