నెల్లూరు జిల్లా పంటపాలెంలోని ఆయిల్ రిఫైనరీలో గ్యాస్ లీక్

Nellore: నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి కార్మికుల తరలింపు

Jyothi
Published on: 1 July 2022 11:28 AM IST
Refinery Oil Gas Leakage | AP News
X

నెల్లూరు జిల్లా పంటపాలెంలోని ఆయిల్ రిఫైనరీలో గ్యాస్ లీక్

Nellore: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెంలోని ఓ ఆయిల్ రిఫైనరీలో గ్యాస్ లీక్ అయింది. ఇమామి అగ్రి టెక్ లిమిటెడ్ ఆయిల్ రిఫైనరీ పరిశ్రమలో కార్మికులు డ్రైనేజీ క్లియర్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. దీంతో ఎనిమిది మంది కార్మికులు అస్వస్థత గురయ్యారు. వారిని హుటాహుటిన నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు ఆరోగ్యం కుదుటుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఆయిల్ రిఫైనరీలో తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల తరచూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 8కి పైగా రిఫైనరీలు ముత్తుకూరు మండలంలో ఉన్నాయి. ఇందులో ప్రధానమైన ఆయిల్ రిఫైనరీలో కార్మికుల రక్షణకు సరైన చర్యలు లేవనేది ఇటీవల కాలంలో పలు సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి. తాజా పరిణామంపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Jyothi

Jyothi

Next Story