Anantapur: రూ.2.5కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Anantapur: అనంతపురం జిల్లా కాసేపల్లి వద్ద ఎర్రచందనం పట్టివేత

Jyothi
Published on: 10 Jan 2023 7:15 AM IST
Red Sandalwood logs worth Rs.2.5 Crore Seized
X

Anantapur: రూ.2.5కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం 

Anantapur: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద పెద్దవడుగూరు పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుకున్నారు. కర్నూలు జిల్లా నుండి బెంగళూరుకు వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పక్క సమాచారం అందుకున్న పెద్దవడుగూరు ఎస్సై రాజశేఖర్ రెడ్డి కిలోమీటర్ల మేర వాహనాన్ని వెంబడించారు. ముగ్గురు తమిళ కూలీలను అరెస్టు చేసి. 2.5 కోట్లు విలువ చేసే 43 ఎర్రచందనం దుంగలతో పాటు ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story