Tirupati: తిరుపతిలో జనసేన, టీడీపీల మధ్య కుదిరిన సయోధ్య

Tirupati: సుగుణమ్మ ఇంటికి వెళ్లిన జనసేన అభ్యర్థి శ్రీనివాసులు

Shashank Gullapelli
Published on: 1 April 2024 6:52 PM IST
Reconciliation Between Janasena And TDP In Tirupati
X

Tirupati: తిరుపతిలో జనసేన, టీడీపీల మధ్య కుదిరిన సయోధ్య

Tirupati: తిరుపతి అసెంబ్లీ స్థానంపై టీడీపీ, జనసేనల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు సద్దుమణిగాయి. ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదిరింది. తిరుపతి స్థానాన్ని జనసేనకు కేటాయించడంపై అసంతృప్తితో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటికి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వెళ్లారు. దీంతో కొన్ని రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. చంద్రబాబు ఆదేశాల మేరకు కలిసి పనిచేస్తామని సుగుణమ్మ తెలిపారు. టీడీపీ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం సాధిస్తోందన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకే కూటమి ఏర్పాటు అయిందన్నారు ఆరిణి శ్రీనివాస్. తిరుపతిని వైసీపీ నేతలు లూటీ చేశారని ఆరోపించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story