ఒకే విధంగా గౌతమ్ రెడ్డి, పునీత్ చనిపోయారా.. పోస్ట్ కొవిడ్ కాంప్లికేషన్స్ వల్ల ఇద్దరూ చనిపోయారా?

Reason Behind AP Minister Mekapati Goutham Reddy and Puneeth Raj Kumar Health
x

ఒకే విధంగా గౌతమ్ రెడ్డి, పునీత్ చనిపోయారా.. పోస్ట్ కొవిడ్ కాంప్లికేషన్స్ వల్ల ఇద్దరూ చనిపోయారా? 

Highlights

Post Covid Complications: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం ఇప్పుడు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Post Covid Complications: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం ఇప్పుడు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న గౌతమ్ రెడ్డి అర్ధాంతరంగా మృతి చెందడంపై అనేక ఊహాగానాలు విన్పిస్తున్నాయ్. గౌతమ్ రెడ్డి రెండుసార్లు కరోనా బారినపడ్డారని ఆ తర్వాత కోలుకున్నప్పటికీ పోస్ట్ కొవిడ్ కాంప్లేకేషన్స్ వల్లే సడెన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్న వర్షన్ కొందరు వైద్యులు విన్పిస్తున్నారు.

ఇటీవల సెడన్ గా హార్ట్ ఎటాక్‌ రావడంతో నటుడు పునీత్ రాజ్ కుమార్ చనిపోయారు. ఆయన ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారని నిత్యం జిమ్‌కు సైతం వెళ్తారని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ పునీత్ సెడన్‌గా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి సైతం అదే విధంగా ప్రాణాలు కోల్పోవడం వెనుక కరోనా కాంప్లికేషన్స్ అన్న చర్చ జరుగుతోంది. కరోనా నుంచి గౌతమ్ రెండు సార్లు కోలుకున్నప్పటికీ హఠాన్మరణం చెందడంపై వైద్యులు అనేక విశ్లేషణలు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories