రాజీనామాకు సిద్ధంగా ఉన్నా : ఎమ్మెల్యే బాలకృష్ణ

Ready to Tender Resignation for Hindupur Says MLA Balakrishna
x

రాజీనామాకు సిద్ధంగా ఉన్నా : ఎమ్మెల్యే బాలకృష్ణ

Highlights

MLA Balakrishna: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్‌ చేశారు.

MLA Balakrishna: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బాలకృష్ణ మౌనదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీపొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

ఉద్యోగుల ఆందోళనల నుంచి దృష్టి మళ్లించేందుకే రాత్రికి రాత్రి జిల్లాలను ప్రకటించారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. మన ప్రాంతం, మన రాష్ట్రం బాగుండాలనేదే తన కోరికని చెప్పారు. హిందూపురం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని బాలకృష్ణ ప్రకటించారు. అన్ని వసతులున్న హిందూపురాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories