Anakapalle: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్‌

Atchutapuram Sez: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెచ్‌లో ప్రమాదం సంభవించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 17 July 2024 11:35 AM IST
Reactor Explosion at Atchutapuram Sez
X

Anakapalle: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్‌

Atchutapuram Sez: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెచ్‌లో ప్రమాదం సంభవించింది. వసంత కెమికల్స్‌లో రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో భయంతో పరుగులు కార్మికులు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story