డాక్టర్‌ నుంచి పోలీస్‌గా రవికిరణ్

డాక్టర్‌ నుంచి పోలీస్‌గా రవికిరణ్
x
Highlights

ఆయన ఒక డాక్టర్. గిరిజనుల సమస్యలకు చలించిపోయారు. వైద్యవృత్తిని నిర్వహిస్తూనే వారి పాలనా పనులు చూసేవారు. ఈ సమయంలో గిరిజనులు చూపించిన ఆప్యాయతతో వైద్య...

ఆయన ఒక డాక్టర్. గిరిజనుల సమస్యలకు చలించిపోయారు. వైద్యవృత్తిని నిర్వహిస్తూనే వారి పాలనా పనులు చూసేవారు. ఈ సమయంలో గిరిజనులు చూపించిన ఆప్యాయతతో వైద్య వృత్తి నుంచి అడ్మినిస్ట్రేటివ్‌కి మళ్లేలా చేశాయి. డాక్టర్‌గా ఉంటే ఒక రంగంలోనే సేవ చేయవచ్చు అదే పాలనా విభాగంలో అనేక రకాలుగా సేవ చేయవచ్చనే ఆలోచనతో డాక్టర్‌ నుంచి పోలీస్ కి మారారనంటారు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్.

జంగారెడ్డిగూడెం డీఎస్పీగా పని చేస్తున్న రవికిరణ్ డాక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టినా ఆ తర్వాత పోలీస్‌గా మారారు. 2002- 2008లో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2010 సివిల్ అసిస్టెంట్‌ సర్జన్‌గా విధులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రిలో విధుల్లో చేరారు. పేదలకు సేవ చేసినందుకు గానూ 2016, 2017 రాష్ట్ర స్థాయి ఉత్తమ ఆస్పత్రి, ఉత్తమ వైద్యులుగా రవికిరణ్ పురస్కారాలు అందుకున్నారు. 2017, 2018లో విశాఖలో పని చేశారు. అయితే పీహెచ్‌సీలో పని చేస్తుండగానే గిరిజనుల సమస్యలు గుర్తించారు. దాంతో రవికిరణ్ చలించి పోయి డాక్టర్‌తో పాటు పాలనా విభాగంలోకి మారాలనుకున్నాడు.

రవికిరణ్ 2016లో గ్రూప్ 1 రాశారు. 2017 ఫలితాలు వచ్చాయి. రవికిరణ్‌కు 12వ ర్యాంక్ వచ్చింది. దీంతో ఆయన డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్ జంగారెడ్డిగూడెం వచ్చారు. ఫ్యామిలీ సపోర్ట్ తోనే తాను ఇంతస్థాయికి వచ్చానంటారు రవికిరణ్. తన తల్లిదండ్రులు, భార్య, తమ్ముడు సపోర్ట్‌తోనే డాక్టర్ నుంచి పోలీస్ విభాగంలోకి చేరానంటారు.

ఇప్పుడు ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉండి రెండు రంగాల్లో సేవ చేస్తున్నానని డిఎస్పీ రవికిరణ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన మహిళలకు ధైర్యం కల్పించేందుకు ప్రణాళికలు చేస్తున్నానంటున్నారు. మొత్తానికి డాక్టర్ నుంచి పోలీస్‌గా మారిన రవికిరణ్ రెండు రంగాల ద్వారా సేవ చేస్తున్నారు. గిరిజనులకు అన్ని రకాలుగా అండగా ఉంటాననంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories