కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన స్నేహితుడు రామశివారెడ్డి

*కోటం రెడ్డితో మాట్లాడిన ఆడియోలను బయటపెట్టిన రామశివారెడ్డి

Jyothi
Published on: 8 Feb 2023 4:41 PM IST
Ramasivareddy Key Comments On Kotamreddy Phone Tapping
X

కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన స్నేహితుడు రామశివారెడ్డి

AP: ఏపీని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి స్పందించారు. కోటంరెడ్డి మాట్లాడిన ఆడియోను రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. కేవలం ఫోన్ అటోమెటిక్ రికార్డింగేనని రామశివారెడ్డి క్లారిటీనిచ్చారు. ఓ కాంట్రాక్టర్ విషయంలో కోటం రెడ్డి తనతో మాట్లాడారన్నారు. అది ఫోన్ లో అటోమెటిక్ గా రికార్డు అయిందన్నారు. ఇదే విషయాన్ని తమ స్నేహితుల వద్ద వివరించానని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంత చిన్న విషయానికి రాష్ట్రం ప్రభుత్వంపై ఆరోపణలు వస్తాయని తాను ఊహించలేదని రామకృష్ణారెడ్డి అన్నారు.

Jyothi

Jyothi

Next Story