శిరోముండనం బాధితుడు ప్రసాద్ అదృశ్యం

*సీతానగరం పోలీస్ స్టేషన్‌లో భార్య ఐశ్వర్య ఫిర్యాదు *ప్రసాద్ నిన్నటి నుంచి కనిపంచడం లేదని ఫిర్యాదు *శిరోముండనం కేసులో నిందితులను ఇంకా అరెస్టు చేయలేదు : మాజీ ఎంపీ హర్షకుమా

Samba Siva Rao
Published on: 4 Feb 2021 6:58 PM IST
శిరోముండనం బాధితుడు ప్రసాద్ అదృశ్యం
X

ఏపీలో సంచలనం రేపిన శిరోముండనం బాధితుడు ప్రసాద్ అదృశ్యమయ్యాడు. నిన్నటి నుంచి కనిపించడం లేదని వరప్రసాద్ భార్య ఐశ్వర్య తూర్పుగోదావరిలోని సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రసాద్‌కు గత ఏడాది జూలైలో సీతానగరం పోలీస్ స్టేషన్‌లోనే శిరోమండనం జరిగిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. దళిత యువకుడికి గుండు గీయించి అవమానించిన కేసులో దోషులను ఇప్పటికీ అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు అదృశ్యమైన ఘటనలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story