స్కూల్లోకి వరదనీరు..రోడ్డపై పాఠాలు

స్కూల్లోకి వరదనీరు..రోడ్డపై పాఠాలు
x
Highlights

పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే పాలకొల్లు 21 వార్డులోని కొత్తపేట స్పెషల్‌ ప్రైమరీ స్కూల్‌ గదుల్లోకి నీరు రావడంతో రోడ్డుమీద...

పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే పాలకొల్లు 21 వార్డులోని కొత్తపేట స్పెషల్‌ ప్రైమరీ స్కూల్‌ గదుల్లోకి నీరు రావడంతో రోడ్డుమీద పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు. గతంలో ఆరు లక్షలు ఖర్చు చేసి మరమ్మతులు చేశారు. అయినా కూడా నీరు క్లాస్ రూముల్లోకి రావడంతో పిల్లలను ఇంటికి వెళ్లమని చెప్పారు టీచర్లు. విద్యార్థులు తమకు పాఠాలు చెప్పాలని అనడంతో రోడ్డుపై పిల్లలకు పాఠాలు చెప్పాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories