ఏపీలోని థియేటర్లలో కొనసాగుతున్న తనిఖీలు.. 30 థియేటర్లు క్లోజ్...

AP Theatres: నిబంధనలు పాటించని సినిమా హాళ్లు సీజ్...

Shireesha
Published on: 24 Dec 2021 1:00 PM IST
Raids Going on in AP Theatres and 30 Closed in Chittoor | AP Latest News
X

ఏపీలోని థియేటర్లలో కొనసాగుతున్న తనిఖీలు.. 30 థియేటర్లు క్లోజ్...

AP Theatres: ఏపీలోని థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తోన్న థియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టికెట్ల ధరలు, థియేటర్లలోని ఫైర్‌ సేఫ్టీ సదుపాయాలను తనిఖీ చేస్తున్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తున్నారా..? లేదా..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు సోదాల నేపథ్యంలో కొందరు థియేటర్‌ యజమానులు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో నిబంధనలు పాటించని 30 సినిమా హాళ్లను మూసివేయడమే గాక, 37 థియేటర్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. విజయనగరంలో జిల్లాలో ఆరు, అమలాపురంలో రెండు థియేటర్లను మూసివేశారు. తునిలో రెండు, ప్రకాశం జిల్లాలో మూడు థియేటర్లను క్లో్జ్‌ చేశారు. అదేవిధంగా ఎమ్మిగనూర్‌లో ఒక థియేటర్‌ను మూసివేశారు అధికారులు.

Shireesha

Shireesha

Next Story