ఇవాళ కర్నూలు జిల్లాలో రెండోరోజు రాహుల్‌ గాంధీ యాత్ర

Bharat Jodo Yatra: ఛాగి గ్రామం నుంచి ఆదోని మీదుగా ఎమ్మిగనూరు చేరుకోనున్న యాత్ర

Jyothi
Published on: 19 Oct 2022 10:25 AM IST
Rahul Gandhi Bharat Jodo Yatra In Kurnool
X

ఇవాళ కర్నూలు జిల్లాలో రెండోరోజు రాహుల్‌ గాంధీ యాత్ర

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో ఇవాళ రెండో రోజు రాహుల్ భారత్ జోడో యాత్ర జరగనుంది. రెండో రోజు ఛాగి గ్రామం నుంచి ఆదోని మీదుగా..ఎమ్మిగనూరుకు యాత్ర చేరుకోనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆదోని ఆర్ట్స్ కాలేజీలో మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఏపీ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఆలూరు నియోజక వర్గానికి చేరుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. కర్నూల్ జిల్లాలో ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల మీదుగా..119 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. ఏపీలో యాత్ర ముగిసిన తరువాత..23న తెలంగాణలోకి ప్రవేశించనుంది. నారాయణపేట జిల్లా నుంచి తెలంగాణ యాత్ర ప్రారంభం కానుంది. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర...12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా..3వేల 700 కిలోమీటర్ల మేర సాగనుంది.

Jyothi

Jyothi

Next Story