Raghu Rama Krishnam Raju: లోక్‌సభ స్పీకర్‌తో భేటీ అయిన రఘురామ కుటుంబసభ్యులు

Raghu Rama Krishnam Raju: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కుటుంబసభ్యులు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు.

Arun Chilukuri
Published on: 20 May 2021 2:47 PM IST
Raghu Rama Krishnam Raju Family Members Meet Lok Sabha Speaker Om Birla
X

Raghu Rama Krishnam Raju: లోక్‌సభ స్పీకర్‌తో భేటీ అయిన రఘురామ కుటుంబసభ్యులు

Raghu Rama Krishnam Raju: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కుటుంబసభ్యులు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని కలిసారు. ఈ సందర్భంగా రాఘురామపై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని అలాగే ఏపీ సీఐడీ చర్యలను, కోర్టు ధిక్కారాన్ని ఓం బిర్లాకు వివరించారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా రఘురామను అరెస్టు చేశారన్నారు. ఆయన ప్రాణానికి ముప్పు ఉందని.. జగన్‌ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన రఘురామ కుటుంబసభ్యులు.. నేడు ఓం బిర్లా, రాజ్‌నాథ్‌లతో భేటీ అయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story