Raghu Rama krishnam Raju: త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తా..

Raghu Rama krishnam Raju: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 7 Jan 2022 5:01 PM IST
Raghu Rama krishnam Raju Announces Resignation From MP Seat
X

Raghu Rama krishnam Raju: త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తా..

Raghu Rama krishnam Raju: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేసేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తుందని అన్నారు. కానీ వాళ్లకు తానే సమయం ఇస్తున్నానని వైసీపీకి సవాల్ విసిరారు. వారంలో తనపై అనర్హత వేటు వేయకపోతే రాజీనామా చేస్తానని వెల్లడించారు. వైసీపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఎన్నికల్లో తేల్చుకుందామన్నారు. రాజధానిగా అమరావతే కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రఘురామ చెప్పారు. ఏపీకి పట్టిన దరిద్రం వదిలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాఘురామ తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story