SV University: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం

SV University: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎస్వీయూలో ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి, సీనియర్ విద్యార్థులతో కలిసి ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు.

Arun Chilukuri
Published on: 4 Nov 2025 2:49 PM IST
SV University: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం
X

SV University: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం

SV University: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎస్వీయూలో ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి, సీనియర్ విద్యార్థులతో కలిసి ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విద్యార్థులు ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని రెక్టార్ కార్యాలయాన్ని ముట్టడించి, నినాదాలు చేశారు. ఆందోళన కారులను పంపించే ప్రయత్నంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశామని విద్యార్థులు తెలిపారు. ర్యాగింగ్ పాల్పడిన సీనియర్ విద్యార్థులు ముగ్గురిని సస్పెండ్ చేయాలని, ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిపై క‎ఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story