PV Ramesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో ట్విస్ట్..

PV Ramesh: నా వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేశారనడం హాస్యాస్పదం

Jyothi
Updated on: 11 Sept 2023 1:20 PM IST
PV Ramesh Comments on Skill Development Case
X

PV Ramesh: నా స్టేట్‍మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరం

PV Ramesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. స్కిల్ డెవలప్‍మెంట్ కేసుపై మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన స్టేట్‍మెంట్ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరమన్నారు పీవీ రమేశ్. తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేశారనడం హాస్యాస్పదమన్నారు. తాను అప్రూవర్‍‌గా మారాననే ప్రచారం అవాస్తవమని.. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‍మెంట్‌లో ఆర్థికశాఖ ఏ తప్పు చేయలేదని.. సీఐడీ తీరుపై తనకు అనుమానం కలుగుతుందన్నారు. చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన పీవీ రమేశ్.. ఇదే కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story