Liquor Mafia: కడప జిల్లాలో రెచ్చిపోయిన మద్యం మాఫియా..

Liquor Mafia: కడప జిల్లా పులివెందులలో మద్యం మాఫియా రెచ్చిపోయింది.

S. Srikanth
Published on: 29 Aug 2020 11:39 AM IST
Liquor Mafia: కడప జిల్లాలో రెచ్చిపోయిన మద్యం మాఫియా..
X

Liquor Mafia: కడప జిల్లా పులివెందులలో మద్యం మాఫియా రెచ్చిపోయింది. వాహనాలు తనికీ చేస్తున్న ఎస్సై గోపీనాథరెడ్డిని డీకొట్టి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే, రెండు కిలోమీటర్లు కరుపైనే ఉన్న గోపీనాథరెడ్డి సినీ ఫక్కిలో మద్యం అక్రమ రవాణాను పట్టుకున్నాడు. కారులో మద్యం అక్రమ రవాణా అవుతుందన్న సమాచారంతో ఎస్సై గోపీనాథరెడ్డి పులివెందులలో వాహనాల తనికీ చేపట్టారు. ఆ వాహనం రాగానే దానిని నిలిపివేయడానికి ఎస్సై ప్రయత్నించారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని నిందితులు కారును వేగంగా ముందుకు పోనిచ్చారు.

అప్రమత్తమైన ఎస్సై జారి కిందపడకుండా కారును గట్టిగా పట్టుకున్నారు. ఎస్సై కారుపై వేలాడుతుండగానే నిందితులు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం కారును పోనిచ్చారు. ఈ క్రమంలో ఎస్సై గోపీనాథ్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి కారు అద్దాలను పగలగొట్టారు. ఇంతలో ఆ కారును వెంబడించిన పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరి నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కాసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందుతులను పట్టుకోవటంలో తన ప్రాణాలకు తెగించి ఇంతటి సాహసం చేసిన ఎస్సై గోపీనాథరెడ్డిపై తాధికారులు ప్రశంసించారు.



S. Srikanth

S. Srikanth

Next Story