Pawan Varahi Vehicle: ఈనెల 24న కొండగట్టులో 'వారాహి' వాహనానికి పూజ

Pawan Varahi Vehicle: కొండగట్టులో 'వారాహి'కి ప్రత్యేక పూజలు చేయనున్న పవన్

Jyothi
Published on: 16 Jan 2023 5:01 PM IST
Puja to Varahi Vehicle in Kondagattu on 24th of this Month
X

Pawan Varahi Vehicle: ఈనెల 24న కొండగట్టులో 'వారాహి' వాహనానికి పూజ

Pawan Varahi Vehicle: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే బస్సు యాత్రకు ప్రత్యేక వాహనాన్ని రెడీ చేసిన జనసేనాని.. ఈనెల 24న కొండగట్టులో 'వారాహి' వాహనానికి తొలిపూజ చేయించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 24న కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలను పవన్ కళ్యాణ్ దర్శించనున్నారు. అదే రోజు కొండగట్టులో 'వారాహి'కి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం తెలంగాణ ముఖ్య నేతలతో కొండగట్టులో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారు.

Jyothi

Jyothi

Next Story