శ్రీశైలంలో ప్రముఖుల ప్రొటోకాల్‌ దర్శనాల్లో మార్పులు

Srisailam Temple: రోజుకు మూడు సమయాల్లో ప్రముఖులకు దర్శనానికి అనుమతి

Jyothi
Published on: 15 Sept 2022 10:35 AM IST
Protocol Darshan Changes In Srisailam Temple
X

శ్రీశైలంలో ప్రముఖుల ప్రొటోకాల్‌ దర్శనాల్లో మార్పులు

Srisailam Temple: శ్రీశైలం దేవస్థానంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ప్రముఖుల ప్రోటోకాల్ దర్శనాల్లో మళ్ళీ స్వల్ప మార్పు చేశారు. రోజుకు మూడు సార్లు ప్రముఖులకు అవకాశం కల్పించారు. సర్వదర్శనం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు మూడు సమయాల్లో ప్రముఖులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. అయితే ఈనెల 2వ తేదీన రోజుకు రెండుసార్లే ప్రముఖుల దర్శనమని ప్రకటించారు. తాజాగా మద్యాహ్నం బ్రేక్ దర్శనానికి ముందు ప్రముఖులను అనుమతించాలని నిర్ణయించామని ఈవో లవన్న తెలిపారు.

Jyothi

Jyothi

Next Story