అమలాపురంలో విధ్వసం.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు..

Konaseema: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

Arun Chilukuri
Published on: 24 May 2022 6:25 PM IST
Protesters set Fire to Minister Vishwaroops House
X

అమలాపురంలో విధ్వసం.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు..

Konaseema: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ఆవేశంతో మంత్రి విశ్వరూప్ ఇంటిపైకి దూసుకెళ్లారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. కామనగరువులోని మంత్రి విశ్వరూప్ క్యాంప్ కార్యాలయంపైనా దాడులు చేశారు ఆందోళనకారులు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే విశ్వరూప్ ఇంటి సమీపంలో 3 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనం రాళ్లదాడి చేశారు. ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story