కొత్త జిల్లాలపై నిరసన సెగలు
Kadapa: కడప జిల్లా రాజంపేట బంద్‌కు అఖిలపక్షం పిలుపు... రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్.
కొత్త జిల్లాలపై నిరసన సెగలు
Kadapa: కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా కడప జిల్లా రాజంపేట బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తెల్లవారుజామునుంచే అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో బస్సులను బైపాస్ నుంచి మళ్లిస్తున్నారు పోలీసులు. అటు దుకాణాలను కూడా నిరసనకారులు మూయిస్తున్నారు. ఆటోలు, రవాణ వాహనాలను సైతం రోడ్లపైకి రాకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన ఆఫీసులు, ఆర్టీసీ డిపో వద్ద మోహరించారు.
Next Story




