నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన ప్రదర్శన

*నాల్గో రోజు టీడీపీ శాసనసభా పక్షం ఆద్వర్యంలో నిరసన ప్రదర్శన

Rama Rao
Published on: 17 March 2022 10:42 AM IST
Protest in TDP Legislative Assembly Led By Nara Lokesh | Telugu News
X

నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన ప్రదర్శన

Andhra Pradesh: నాటు సారా, జే బ్రాండ్ మద్యంతో వందలాది మంది చనిపోతున్నారంటూ టీడీపీ శాసనసభా పక్షం ఆధ్వర్యంలో వరుసగా నాల్గోరోజు నిరసన చేపట్టారు. జే బ్రాండ్ తో సీఎం జగన్ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. ప్లకార్జులో ప్రదర్శన చేపట్టారు. రాష్ర్టాన్ని జే బ్రాండ్ మధ్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని టీడీపీ నేతలు మండిపడ్డారు. నాసీరకం మద్యం, నాటుసారాతో మహిళల మాంగల్యాలు తెంచుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో అసత్య ప్రకటన చేసిన సీఎం జగన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కల్తీసారా మరణాలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే అన్యాయంగా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారని మండి పడ్డారు.

Rama Rao

Rama Rao

Next Story