AP News: దొంగ ఓట్లపై వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు

Protest In Front Of Tirupati RDO office
x

AP News: దొంగ ఓట్లపై వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు

Highlights

AP News: టీడీపీ నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి తరలించిన పోలీసులు

AP News: తిరుపతి ఆర్డీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగ ఓట్లపై వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు దిగడంతో వాగ్వాదం, ఘర్షణ వాతావరణం నెలకొంది. 30వేల దొంగ ఓట్లు నమోదు చేశారని ఆర్డీవో కార్యాలయం దగ్గర చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పులివర్తి నాని నిరాహార దీక్ష చేపట్టారు. అయితే టీడీపీకి పోటీగా ఆర్డీవో కార్యాలయం దగ్గరే వైసీపీ నేతలు కూడా ఆందోళనకు దిగారు. దీంతో శిబిరం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకోగా.. శిబిరం నుంచి వెళ్లిపోవాలని టీడీపీ, వైసీపీ నేతలకు పోలీసులు సూచించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

మరోవైపు దీక్షకు దిగిన టీడీపీ నేతలను శిబిరం ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించడం కూడా ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి యత్నించారు పులివర్తి నాని. శిబిరం నుంచి వెళ్లేందుకు టీడీపీ నేతలు అంగీకరించకపోవడంతో.. వారిని బలవంతంగా అరెస్ట్ చేసి తరలించారు పోలీసులు. దీంతో దొంగ ఓట్లపై శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories