ఏపీలో నీటితో కళకళలాడుతోన్న ప్రాజెక్టులు..

ఏపీలో నీటితో కళకళలాడుతోన్న ప్రాజెక్టులు..
x
Highlights

రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఈ రెండు నదుల కింద ఉన్న ప్రాజెక్టులు..

రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఈ రెండు నదుల కింద ఉన్న ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. పెన్నా నదిలో వరద ప్రవాహం తగ్గింది.. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,18,326 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 884 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.7 అడుగులు లెవల్లో నీరు ఉంది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ లో 213.88 టీఎంసీల నీరుంది. దీంతో కుడి కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ.. 2 గేట్ల ద్వారా 1,33,900 క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపునాగార్జున సాగర్‌లోకి 91,001 క్యూసెక్కులు చేరుతోంది. సాగర్‌లో ప్రస్తుతం 589.9 అడుగుల్లో 311.75 టీఎంసీలను నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం సామర్ధ్యం 315 టీఎంసీలు. దాదాపుగా ప్రాజెక్టు నిండడంతో 4 గేట్లు ఎత్తి విద్యుత్‌ కేంద్రం ద్వారా 90 వేల క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. దాంతో పులిచింతల ప్రాజెక్టులోకి 96,718 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 46టీఎంసీలకు గాను ప్రస్తుతం 45.36 నీరు నిల్వ ఉంది..

దీంతో ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతుండటంతో స్పిల్‌ వే గేట్ల ద్వారా 78,219 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ఇటు ప్రకాశం బ్యారేజీలోకి వరద ప్రవాహం 29,172 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టాకు 10,990 క్యూసెక్కులను విడుదల చేయగా.. 94 వేల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. ఇటు సోమశిలలోకి పెన్నా నది నుంచి 16,455 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 74.02 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దాంతో కండలేరుకు 10,238 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇదిలావుంటే గోదావరి నదిమీద ఉన్న ధవళేశ్వరంలోకి 4,21,444 క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా.. 4,12,876 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. ఇక గొట్టా బ్యారేజీలోకి 5,849 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 3,489 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories