పోలవరంలో ప్రాజెక్ట్‌ అథారిటీ సీఈవో పర్యటన

పోలవరంలో ప్రాజెక్ట్‌ అథారిటీ సీఈవో పర్యటన
x
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ పర్యటిస్తున్నారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన పనులు జరగుతున్న తీరుపై సంతృప్తి...

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ పర్యటిస్తున్నారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన పనులు జరగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తపరిచారు. తాజాగా ఏర్పాటు చేసిన ఆర్మ్ గర్డర్స్‌ను చంద్రశేఖర్‌ అయ్యర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రేపు సాయంత్రానికి తొలి గేటు అమర్చుతామని చంద్రశేఖర్‌కు తెలిపారు ప్రాజెక్ట్ అధికారులు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నాలుగు రోజులపాటు పశ్చిమ, తూర్పు గోదావరి జలాల్లో పర్యటిస్తామన్నారు. పోలవరం లో పనులు ఏవిధంగా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు వచ్చామని ప్రాజెక్ట్ పనులు సంతృప్తికరంగా జరుగుతున్నట్లు తెలియజేశారు.

స్పిల్ వే, కాంక్రిట్ , ఇతర పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కుడి, ఎడమ కాలువలు భూసేకరణ ఎలా ఉన్నది అనే అంశంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నామఅని, ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు 2230 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పనులు, బిల్లులు పరిశీలించాక మరిన్ని నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సిఫారసు చేయనున్నట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories