సుబ్బయ్య హత్య కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: మున్సిపల్ కమిషనర్

X
Highlights
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు మున్సిపల్...
Arun Chilukuri31 Dec 2020 10:33 AM GMT
కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ అనురాధ చెప్పారు. సుబ్బయ్య హత్య తర్వాత తాను అజ్ఞాతంలోకి వెళ్లానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సుబ్బయ్య కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే తన పేరు ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. సుబ్బయ్య హత్య జరిగినప్పుడు తాను హోమంలో ఉన్నానని, అక్కడికి సుబ్బయ్య వస్తే కాసేపు ఎదురుచూడమని మాత్రమే చెప్పానన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని మున్సిపల్ కమిషనర్ అనురాధ చెప్పారు. గతంలో సుబ్బయ్య అనేకసార్లు సమస్యలపై కలిసారని ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా తనతో మాట్లాడారని తెలిపారు. హత్యకు సంబంధం ఉన్నట్లు తన పేరు చెప్పడం అన్యాయమన్నారు.
Web Titleproddutur municipal commissioner Anuradha respond on tdp leader subbaiah murder case
Next Story