Bapatla: స్కూల్‌ బస్సు బోల్తా.. 9 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

Private School Bus Overturns in Bapatla
x

Bapatla: స్కూల్‌ బస్సు బోల్తా.. 9 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

Highlights

Bapatla: బాపట్ల జిల్లా అమృతలూరులో ప్రమాదం జరిగింది.

Bapatla: బాపట్ల జిల్లా అమృతలూరులో ప్రమాదం జరిగింది. ఓ స్కూల్‌ బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లి తిరగబడింది. ఈ ఘటనలో 9 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హుటాహుటిన స్థానికులు వారిని తెనాలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వేరే వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తుండగా అదుపుతప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. స్వాతంత్ర్య వేడుకలు ముగించుకొని ఇళ్లకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories