కొట్నూరు చెరువు వద్ద తప్పిన పెను ప్రమాదం.. వరద ప్రవాహంలో చిక్కుకున్న ప్రైవేటు బస్సు

*బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు *స్థానికుల సహాయంతో బయటపడ్డ ప్రయాణికులు

Shilpa
Published on: 22 Nov 2021 12:19 PM IST
Private Bus Trapped in Floods at Kotnur Lake Hindupur in Anantapuram
X

వరద ప్రవాహంలో చిక్కుకున్న ప్రైవేటు బస్సు(ఫైల్ ఫోటో)

Anantapuram: అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హిందూపురం నియోజకవర్గంలోని అన్ని చెరువులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హిందూపురం కోట్నూరు చెరువు నిండి మరువ ఉధృతంగా ప్రవహిస్తోంది.

గార్మెంట్స్ పరిశ్రమలో పని చేసేందుకు మహిళలతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పింది. చెరువు మరువ గేట్లు తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో వెంటనే బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది మహిళలు బస్సు దిగి పరుగులు పెట్టారు. కొట్నూరు గ్రామానికి చెందిన యువకులు బస్సు వద్దకు వచ్చి మహిళలను చెరువు ఒడ్డుకు చేర్చారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Shilpa

Shilpa

Next Story