సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మోదీ

సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మోదీ
x
ప్రధాని నరేంద్రమోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైల్ ఫోటో
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రార్ధిస్తున్నాను' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందులో.. 'ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.' అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

మంత్రి ధర్మాన కృష్ణదాసు కూడా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజన్న తనయుడిగా,విజయమ్మ పుత్రునిగా ఇచ్చిన మాట కోసం తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం వెనకడుగేయని ధీరుడు రాయలసీమ ముద్దుబిడ్డ, 5 కోట్ల మంది ప్రజల గుండెచప్పుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.
Show Full Article
Print Article
More On
Next Story
More Stories