ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ

Chandrababu: సుదీర్ఘ కాలం తర్వాత ఇరువురి భేటీ

Sriveni Erugu
Published on: 7 Aug 2022 8:45 AM IST
Prime Minister Modi and TDP chief Chandrababu met
X

ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ

Chandrababu: ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశం జరిగింది. ఢిల్లీ నుంచి అందిన ఆహ్వానం మేరకు చంద్రబాబు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ, చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 5 నిమిషాల పాటు వీరిద్దరూ మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story