దొంగ అవతారమెత్తిన పూజారి.. చోరీ చేస్తుండగా చితకబాదిన భక్తులు

Priest Tries to Steal Devotee Ornaments in Kurnool District
x

దొంగ అవతారమెత్తిన పూజారి.. చోరీ చేస్తుండగా చితకబాదిన భక్తులు

Highlights

Kurnool: దేవుడికి, భక్తులకు వారధిలా ఉండాల్సిన పూజారే దొంగ అవతారమెత్తిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో వెలుగుచూసింది.

Kurnool: దేవుడికి, భక్తులకు వారధిలా ఉండాల్సిన పూజారే దొంగ అవతారమెత్తిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో వెలుగుచూసింది. పులికొండలోని రంగస్వామి దేవాలయానికి వచ్చిన మహిళా భక్తుల ఆభరణాలను దొంగిలించేందుకు ఆ ఆలయ పూజారే ప్లాన్‌ చేశాడు. ఆలయ ప్రాంగణంలో మహిళ భక్తులు నిద్రిస్తున్న వేళ చోరీకి యత్నించాడు. అయితే మహిళకు మెలకువ వచ్చి, గట్టిగా అరవడంతో అక్కడున్నవారు పారిపోతున్న పూజారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా ఘటనపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories