Droupadi Murmu: ఈ నెల 26న రాష్ట్రపతి ముర్ము శ్రీశైలం పర్యటన

Droupadi Murmu: స్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్న రాష్ట్రపతి

Jyothi
Updated on: 22 Dec 2022 1:21 PM IST
President Draupadi Murmu Will Visit Srisailam Temple On December 26th
X

Droupadi Murmu: ఈ నెల 26న రాష్ట్రపతి ముర్ము శ్రీశైలం పర్యటన

Droupadi Murmu: ఈ నెల 26న శ్రీశైలంలో పర్యటించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని ఆమె దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నల్లమల అడవులను గ్రేహౌండ్స్ దళాలు జల్లెడ పడుతున్నాయి. శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు, శిఖరేశ్వరం సమీపంలోని నల్లమల అడవుల్లో గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరో నాలుగు రోజులలో రాష్ట్రపతి ముర్ము పర్యటించనున్న నేపథ్యంలో నల్లమల అడవులను అనువణువునా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

రాష్ట్రపతి ముర్ము శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అయితే రాష్ట్రపతి హెలికాప్టర్‌తో పాటు మరో రెండు హెలికాప్టర్లు సున్నిపెంట హెలిప్యాడ్‌లో దిగుతాయన్న సమాచారం ఉంది. దీంతో ప్రస్తుతం ఒక హెలికాప్టర్ దిగేందుకు అనుకూలంగా హెలిప్యాడ్‌ నిర్మించారు. మరో రెండు హెలికాప్టర్లు దిగేందుకు అధికారులు హెలిపాడ్లను సిద్దం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story