ఇవాళ ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

* రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్న ద్రౌపది ముర్ము

R Tripura Malini
Published on: 4 Dec 2022 10:38 AM IST
President Draupadi Murmu To Visit AP Today
X

ఇవాళ ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

President Murmu In Andhra Pradesh: ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 10గంటల 15నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకుంటారు. రాష్ట్రపతికి సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పౌర సన్మాన కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము హజరుకానుంది. రాష్ట్రపతికి గవర్నర్, సీఎం జగన్ పౌర సన్మానం చేయనున్నారు. అనంతరం రాష్టపతికి గవర్నర్ విందు ఇవ్వనున్నారు. విందుకు సీఎం జగన్..హైకోర్టు సీజే జస్టిస్ మిశ్రా తదితరులు హాజరుకానున్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖపట్నానికి రాష్ట్రపతి బయలుదేరి వెళ్లనున్నారు. విశాఖ తీరంలో జరగనున్న నేవీ డే వేడుకలకు రాష్ట్రపతి ముర్ము హజరుకానున్నారు. అనంతరం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకోనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story