CM Jagan: ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్‌కి రిపోర్టు ఇచ్చిన పీకే టీమ్

CM Jagan: త్వరలో ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం

Rama Rao
Updated on: 12 Sept 2022 6:01 PM IST
Prashant Kishor Team Gave a Report to CM Jagan on the Performance of the MLAs
X

CM Jagan: ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్‌కి రిపోర్టు ఇచ్చిన పీకే టీమ్

CM Jagan: ఏపీలో ఎమ్మెల్యేల పనితీరుపై స్టడీ చేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్ సీఎం జగన్‌కు నివేదిక ఇచ్చింది. దీంతో నివేదిక ఆధారంగా సీఎం జగన్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. గడప గడపకు ప్రభుత్వం పేరుతో క్షేత్రస్థాయిలో ఏం సాధించారు, ప్రజల స్పందన ఎలా ఉంది, పార్టీ పరిస్థితి మెరుగుపరచుకోడానికి ఎమ్మెల్యేల పాత్ర ఏంటి? అనే అంశాలపై సమావేశంలో చర్చించబోతున్నారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలో దిగేందుకు ప్రశాంత్ కిశోర్ నివేదిక ప్రామాణికం కాబోతోందనే అంశం చర్చనీయాంశమైంది. పీకే టీమ్ రిపోర్టులో ఏయే ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది? ఎవరి పనితీరులో మార్పు తెచ్చుకోవాలోనని సీఎం జగన్ క్లాస్ తీసుకోనున్నారు. ఇటీవల మంత్రులతో జగన్ కఠినంగా వ్యవహరించడంతో చాలా మంది ఎమ్మెల్యేలు అలర్టైనట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story