జగన్ పీకే చెప్పినట్టు నడుచుకుంటారా? వైసీపీతో కాంగ్రెస్ పొత్తు...

Prashant Kishor - YS Jagan: *కాంగ్రెస్ పార్టీపై గుస్సాగా సీఎం జగన్ *హస్తం తీరుతోనే కష్టాలన్న భావన

Shireesha
Published on: 22 April 2022 4:49 PM IST
Prashant Kishor Advising YS Jagan Unite YSRCP with Congress | Live News Today
X

జగన్ పీకే చెప్పినట్టు నడుచుకుంటారా? వైసీపీతో కాంగ్రెస్ పొత్తు...

Prashant Kishor - YS Jagan: ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు సాధ్యమా? పీకే చెప్పినంత మాత్రాన జగన్ పొత్తుకు సై అంటారా? కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పీకే ఇచ్చిన రిపోర్ట్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయంలో పీకే కీలక భూమిక పోషించారు. ఎవరిని చేర్చుకోవాలి.... ఎక్కడ్నుంచి పోటీ చేయించాలి.. ప్రత్యర్థులను ఎలా ఢీకొట్టాలన్నదానిపై గతంలో జగన్ కు కీలక సూచనలు చేశారు పీకే.

అయితే తాజాగా పీకే కాంగ్రెస్ పార్టీలో చేరబోతుండటంతో కొత్త ఈక్వేషన్లు వర్కౌట్ అవుతాయా అన్న చర్చ మొదలైంది. తాజాగా పీకే సోనియాకు ఇచ్చిన రిపోర్ట్‌లో కాంగ్రెస్ పార్టీకి కీలక సూచనలు చేశారు. ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునేందుకు దోహదకారి అవుతుందన్న సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story