సంచలనం సృష్టించిన తల్లీబిడ్డ హత్య కేసును చేధించిన పోలీసులు

సంచలనం సృష్టించిన తల్లీబిడ్డ హత్య కేసును చేధించిన పోలీసులు
x
కోటేశ్వర్ రావు
Highlights

ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన తల్లీబిడ్డ హత్యకేసును పోలీసులు చేధించారు. అనుమానంతో భార్య, కూతురిని భర్తే చంపేశాడు. ఒంగోలులోని కిమ్స్ లోని ఫామ్...

ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన తల్లీబిడ్డ హత్యకేసును పోలీసులు చేధించారు. అనుమానంతో భార్య, కూతురిని భర్తే చంపేశాడు. ఒంగోలులోని కిమ్స్ లోని ఫామ్ సిలో కోటేశ్వర్ రావు పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కూతురు ఉన్నారు. భార్యపై కోటేశ్వర్ రావు అనుమానం పడేవాడు. ఈ నెల మూడో తేదిన భార్య, కూతురిని బైక్ పై మద్దిపాడు మండలం కొత్త పల్లి గ్రామానికి తీసుకెళ్లాడు. సమీప పొదల్లో భార్య, కూతురిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు.

తల్లీబిడ్డ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు కోటేశ్వర రావు ఏమీ తెలియనట్లు నటించాడు. ఎటువంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్తపడ్డాడు. అన్ని కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేసి చేధించలేకపోయారు. హంతకుడి వివరాలు తెలియజేస్తే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు.

భార్య, బిడ్డను కాల్చి చంపే సమయంలో కోటేశ్వర్ రావు చేతులు కాలాయి. తాను పని చేసే ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో గుట్టుగా వైద్యం చేసుకుంటున్నాడు. కోటేశ్వర రావు తీరుపై తోటి సిబ్బందికి, డాక్టర్లకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోటేశ్వర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. అనుమానంతో భార్య, కూతురిని సజీవ దహనం చేసినట్లు కోటేశ్వర్ రావు ఒప్పుకున్నాడు. దీంతో ఈ కేసు అసలు గుట్టు బయటపడింది.Show Full Article
Print Article
More On
Next Story
More Stories