Prakasam: డ్రైవర్, క్లీనర్ మధ్య వివాదం.. స్కూల్ బస్సుకు నిప్పంటించిన క్లీనర్

School Bus on Fire: ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సు డ్రైవర్,క్లీనర్‌కు మధ్య వివాదం బస్సు దగ్ధానికి దారి తీసింది.

Arun Chilukuri
Published on: 2 Dec 2025 12:50 PM IST
Prakasam: డ్రైవర్, క్లీనర్ మధ్య వివాదం.. స్కూల్ బస్సుకు నిప్పంటించిన క్లీనర్
X

Prakasam: డ్రైవర్, క్లీనర్ మధ్య వివాదం.. స్కూల్ బస్సుకు నిప్పంటించిన క్లీనర్

School Bus on Fire: ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సు డ్రైవర్, క్లీనర్‌కు మధ్య వివాదం బస్సు దగ్ధానికి దారి తీసింది. అర్దవీడు మండలం పాపినేనిపల్లిలో పిల్లలను స్కూలుకు తీసుకువెళ్తున్న బస్సు డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ జరిగింది. అది కాస్తా పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. రోజు మాదిరిగానా విద్యార్ధులను బస్సులో స్కూల్ కు తరలించే క్రమంలో బస్సు నిలిచిపోయింది.

బస్సు డ్రైవర్ నబీ రిపేర్ చేస్తుండగా వెనుకనుంచి వచ్చిన క్లీనర్ గోపాల్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బస్సు పూర్తిగా తగులపడిపోయింది. బస్సు డ్రైవర్ నబి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అర్దవీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యానికి తనపై చాడీలు చెబుతున్నాడని డ్రైవర్ ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story