సీఎం జగన్ పాలనపై హీరో ప్రభాస్‌ ఆసక్తికర కామెంట్‌

సీఎం జగన్ పాలనపై హీరో ప్రభాస్‌ ఆసక్తికర కామెంట్‌
x
Highlights

సాహో ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆదివారం సాహో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల...

సాహో ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆదివారం సాహో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చెన్నైలో ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో ప్రభాస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడులో వైఎస్‌ జగన్‌ను పొలిటికల్‌ బాహుబలిగా చూస్తారు.. మరి మీకు జగన్ పాలనా ఎలా అనిపిస్తుంది.. అంటూ ప్రభాస్‌ను ప్రశ్నించగా... దానికి ఆయన ఈ విధంగా బదులిచ్చారు. 'నాకు పాలిటిక్స్‌ అంతగా తెలియవు. కానీ ఆయన బాగానే పరిపాలిస్తున్నాడని అనుకుంటున్నాను. ఆయన యంగ్‌ సీఎం.. వైఎస్‌ జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఇంకా బాగుంటుందనుకుంటున్నా' అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories