Tirumala: తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

Tirumala: గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించిన శ్రీవారు

Jyothi
Published on: 26 March 2024 8:06 AM IST
Pournami Garuda Seva in Tirumala
X

Tirumala: తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడసేవ వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ప్రతి నెలా పౌర్ణమి నాడు మలయప్ప స్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించడం ఆనవాయితీగా వస్తోంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ... భక్తులను క‌టాక్షించారు. తిరుమాఢ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామి వారి దర్శనంతో సప్తగిరులు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి.

Jyothi

Jyothi

Next Story