తిరుమలలో నేత్రపర్వంగా పుష్యమాస పౌర్ణమి గరుడసేవ

Tirumala: నాలుగు మాఢవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించిన శ్రీవారు

Jyothi
Published on: 26 Jan 2024 8:54 AM IST
Pournami Garuda Seva in Tirumala
X

తిరుమలలో నేత్రపర్వంగా పుష్యమాస పౌర్ణమి గరుడసేవ

Tirumala: తిరుమలలో శ్రీవారి పుష్యమాస పౌర్ణమి గరుడసేవ నేత్రపర్వంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై నాలుగు మాడావీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. స్వామివారు ప్రతిరూపమైన మలయప్పస్వామి బంగారు గరుడుడుని అదిరోహించగా, అర్చకస్వాముల ఉత్సవమూర్తికి విశేష అలంకరణాల చేసిన తరువాత వాహన సేవ ఊరేగింపు ప్రారంభమైంది.

ముందు గజరాజులు నడువగా, కోలాటాలు, భజన బృందాలు ప్రదర్శనలు, కూడల్లో స్ధానికులు, భక్తులు సమర్పించే కర్పూర హారతులతో నడుమ తిరుమలేశుని పౌర్ణమి గరుడవాహన సేవ కన్నులపండువగా సాగింది. వేలాది మంది భక్తులు, స్ధానికలు, ఉద్యోగులు, అధికారులు స్వామివారి వాహన సేవను దర్శించుకున్నారు.

Jyothi

Jyothi

Next Story