వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోతుల సునీత నామినేషన్ దాఖలు

X
Highlights
ఏపీ శాసనమండలి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోతుల సునీత నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి...
Arun Chilukuri11 Jan 2021 10:29 AM GMT
ఏపీ శాసనమండలి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోతుల సునీత నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆశీస్సులతో నామినేషన్ వేసినట్లు పోతుల సునీత తెలిపారు. 20ఏళ్లపాటు టీడీపీలో పనిచేస్తే చంద్రబాబు నరకం చూపించారని కానీ, ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మూడు నెలల్లోనే సీఎం జగన్ తనకు మండలి టికెట్ ఇచ్చారని అన్నారు. కుట్ర రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్టన్న పోతుల సునీత చివరికి దేవుడిని కూడా వదలడం లేదని మండిపడ్డారు. కాగా మండలిలో ఖాళీగా ఉన్న ఓ స్థానానికి ఇదివరకే నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన సునీత.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో చేరారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు అయ్యారు.
Web TitlePothula Sunitha to be YCP candidate for MLC by-election
Next Story