అమిత్ షా గారూ.. విశాఖను రక్షించండి అంటూ వినతులు

Visakha: విశాఖలో..సేవ్ వైజాగ్ పేరుతో వెలిసిన పోస్టర్లు

Jyothi
Published on: 18 Jun 2023 10:16 AM IST
Posters with the name Save Vizag in Visakha
X

అమిత్ షా గారూ.. విశాఖను రక్షించండి అంటూ వినతులు

Visakha: సేవ్ వైజాగ్ పేరుతో విశాఖలో వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. విశాఖలో జన జాగరణ సమితి పలుచోట్ల.. అమిషా గారూ..విశాఖను రక్షించండి అని రాసున్న పోస్టర్లు ఏర్పాటు చేసింది. నగరంలో భూకబ్జాలు, గనులు, గంజాయి మాఫియా, క్రికెట్ బెట్టింగ్ తదితర నేరాలు పెచ్చుమీరుతున్నాయని అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు ఏర్పాటు చేసింది. ప్రశాంతతకు మారు పేరైన విశాఖలో భూములకు రక్షణ లేకుండా పోయిందని జన జాగరణ సమితి ప్రతినిథులు వాపోయారు. భూ కబ్జాలు, గంజాయి గురించిన వార్తలు తరచూ వింటున్నామని విచారం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ విశాఖ ఎం.పీ.ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ ఉదాంతంపై విచారం వ్యక్తం చేశారు. అరాచక శక్తులకు విశాఖ అడ్డాగా మారిందని గతంలో వ్యాఖ్యానించిన హోం మంత్రి అమిత్ షాయే నగరాన్ని కాపాడాలని ఆయన కోరారు.

Jyothi

Jyothi

Next Story