Posani Krishna Murali: చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ పై పోసాని కృష్ణమురళి ఫైర్

Posani Krishna Murali: వాలంటీర్లపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుసున్నారు

Shashank Gullapelli
Published on: 10 April 2024 4:32 PM IST
Posani Krishna Murali Press Meet
X

Posani Krishna Murali: చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ పై పోసాని కృష్ణమురళి ఫైర్

Posani Krishna Murali: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీపై ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాలంటీర్లపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. 2014లో ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. ఇక పురంధేశ్వరి రాజకీయ అవకాశ వాదని అన్నారు. అవసరాన్ని బట్టి పార్టీలు మార్చుతుందని విమర్శించారు. బీజేపీ కోసం కాకుండా చంద్రబాబు కోసం పని చేస్తుందని ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దు చేయమని లేఖరాసిన పురంధేశ్వరి.. స్టేల బతుకుతున్న చంద్రబాబు గురించి.. సుజనా చౌదరి కేసులపై ఎందుకు రాయలేదని పోసాని ప్రశ్నించారు. పురంధరేశ్వరి లేడీ విలన్ లా తయారయ్యిందని ఎద్దేవా చేశారు. మహిళా వాలంటీర్లను నీచంగా అవమానించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ మానసిక రోగి, ఉన్మాదిలా తయారయ్యాడని అన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story