Guntur: గుంటూరు పరువు హత్య కేసులో ఏడుగురి అరెస్ట్

Guntur: గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన హత్య కేసులోని ముద్దాయిలను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 17 Oct 2025 11:37 AM IST
Guntur: గుంటూరు పరువు హత్య కేసులో ఏడుగురి అరెస్ట్
X

Guntur: గుంటూరు పరువు హత్య కేసులో ఏడుగురి అరెస్ట్

Guntur: గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన హత్య కేసులోని ముద్దాయిలను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 7 వ తేదీన గణేష్‌ అనే వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి హత్యకి పాల్పడ్డారు నలుగురు వ్యక్తులు. హత్య చేసిన నలుగురితో పాటు వారికి సహకరించిన ముగ్గురు నిందితులను కూడా పట్టుకున్నట్టు డీఎస్పీ అజీజ్ తెలిపారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా కీలక ఆధారాలు సేకరించినట్లు ఆయన వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని గుంటూరు డీఎస్పీ అజీజ్ తెలిపారు. దుర్గారావు చెల్లిని గణేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడని... ఇది నచ్చని దుర్గారావు గణేష్‌ను హత్య చేసినట్లు హత్యకు గల కారణాన్ని వివరించారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story