Somu Veerraju: సీఈసీ, ఎస్‌ఈసీకి బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఫిర్యాదు

Somu Veerraju: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు.

Arun Chilukuri
Updated on: 24 Oct 2021 6:38 PM IST
Poll Code Violated in Badvel, Somu Veerraju Complains to Election Commission
X

Somu Veerraju: సీఈసీ, ఎస్‌ఈసీకి బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు ఫిర్యాదు

Somu Veerraju: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు. బద్వేలు ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని స్థానిక బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు బెదరిస్తున్నారని కంప్లయింట్‌ ఇచ్చారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే ఎస్సై స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు బదిలీ చేయాలని కోరారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా సాగేలా చర్యలు చేపట్టాలని, ఎన్నికలు సజావుగా సాగాలంటే కేంద్ర బలగాలను పంపాలని అన్నారు.

ఇక ఎస్‌ఈసీకి కూడా మరో ఫిర్యాదు చేశారు సోము వీర్రాజు. పోరుమామిళ్ల, బి.కోడూరు మండలాల్లో ఆశా వర్కర్లకు వైద్య సిబ్బంది స్మార్ట్‌ఫోన్లు, వాచీలను పంపిణీ చేశారని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఓటర్లను ప్రలోభ పెట్టడంలాంటిదేనని అన్నారు. అధికార పార్టీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు సోము వీర్రాజు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story