Andhra Pradesh: ప్రజాబాట పడుతున్న అధినేతలు

Andhra Pradesh: *జిల్లాల పర్యటనకు సీఎం జగన్ శ్రీకారం *రాష్ట్రంలో విస్తృత పర్యటనకు చంద్రబాబు ప్రణాళిక

Rama Rao
Updated on: 22 April 2022 1:41 PM IST
Politics in Andhra Pradesh | AP News Today
X

ప్రజాబాట పడుతున్న అధినేతలు 

Andhra Pradesh: ఏపీలో రాజకీయాలు ఊపందనుకున్నాయి. సమీపంలో ఎన్నికలు లేకున్నా పార్టీ అధినేతలు ప్రజాబాట పడుతున్నారు. టూర్ల పేరుతో బిజీబిజీగా గడుపున్నారు. సీఎం జగన్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతో జిల్లాలు చుట్టనున్నారు జగన్. పార్టీ పటిష్టతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమాయత్తం అయ్యారు. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపనున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేందుకు ప్రణాళిక రెడీ చేసుకున్నారు. ప్రతి జిల్లాలో బస్సు యాత్ర చేయనున్నారు. ఇప్పటికే నారా లోకేష్ బాదుడే బాదుడు కార్యక్రమంతో బిజీగా ఉన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా కౌలు రైతుల మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.


Rama Rao

Rama Rao

Next Story